Saptagiri to Join TDP: టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న స్టార్ కమెడియన్ సప్తగిరి, చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు జిల్లా నుంచి పోటీకి రెడీ అంటున్న నటుడు
Saptagiri to join TDP (Photo-Video Grab)

రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. తాను త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కమెడియన్ వెల్లడించారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి సప్తగిరి ప్రకటన చేశారు.

తనది చిత్తూరు జిల్లానే అని, ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టానని సప్తగిరి చెప్పారు. బంగారుపాళ్యం, పుంగనూరులో చదివానని తెలిపారు. ‘‘పేదల కష్టాలు నాకు తెలుసు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవమేనని, కాకపోతే ముందే చెప్పడం సరికాదని అన్నారు. మరో 10, 15 రోజుల్లో శుభవార్త చెబుతానని చెప్పారు.

జబర్దస్త్ కమెడియన్‌కి అండగా ఏపీ ప్రభుత్వం, పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని తెలిపిన ఏపీ సీఎంఓ

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏమి ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టీడీపీ అధికారంలో రావడానికి తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని, చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. చంద్రబాబు డెవలప్‌మెంట్‌ను అందరూ చూశారని.. తాను ఎన్నికల్లో పోటీచేయడంపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటికే నారా లోకేశ్ ను పాదయాత్రలో కలిశానని చెప్పుకొచ్చారు.

వీడియో ఇదిగో, ఆదిపురుష్ ఈవెంట్లో ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

నిజాయితీతో సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకోగలిగాను. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటా. సినిమా వల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయి. సినిమాలను వదిలేసేది లేదని తెలిపారు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సప్తగిరి అడుగుపెట్టారు. తర్వాత పరుగు, కందిరీగ, దరువు, గబ్బర్ సింగ్, జులాయి, ప్రేమ కథా చిత్రమ్, లవర్స్, రాజు గారి గది, ఎక్స్ ప్రెస్ రాజా, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్ బీ సినిమాల్లో హీరోగానూ నటించారు.