Vishwak Sen: ప్రమాదవశాత్తు లారీ నుంచి జారీ కింద పడిపోయిన టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెట్‌లో ప్రమాదం
నిమా హీరోలు ఎంత జాగ్రత్తగా ఉన్నా షూటింగ్ సమయంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా నటుడు విశ్వక్ సేన్ గాయపడినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . ఈ సినిమా యాక్షన్ తో కూడిన చిత్రం.
సినిమా హీరోలు ఎంత జాగ్రత్తగా ఉన్నా షూటింగ్ సమయంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా నటుడు విశ్వక్ సేన్ గాయపడినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . ఈ సినిమా యాక్షన్ తో కూడిన చిత్రం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో విశ్వక్ గాయపడినట్లు సమాచారం.
ఫైటింగ్ సీన్స్ రిహార్సిల్ చేస్తోన్న సమయంలో సేన్ అకస్మాత్తుగా లారీ నుంచి కిందకు జారీ పడ్డాడు. దీంతో ఆయన కాలుకు చిన్న గాయమైంది. ఈ గాయం కొన్ని రోజుల క్రితమే జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం విశ్వక్ కోలుకుని తిరిగి షూట్ లో పాల్గొనట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు రావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్
కృష్ణచైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ తో కూడిన సన్నివేశాలు, వినోదం తో నిండిన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సేన్ పూర్తిగా మాస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా లో ఉన్న ఒక పాటను విడుదల చేయగా ఆ పాట మిలియన్ల వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసినట్లుగా ఉంది.
Here's Video
అదే విధంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ వెళ్లి కలిసిన ఫోటోలు కూడా బయటకు కనిపించడంతో .. ఈ చిత్రం పై మరింత ఆసక్తి ఏర్పడింది. వచ్చే నెల డిసెంబర్ 8 న ఈ చిత్రం విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రం గురించి సేన్ స్పందిస్తూ.. డిసెంబర్ 8 న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోబోతున్నదని సేన్ వ్యక్తం చేసాడు.
(The above story first appeared on LatestLY on Nov 15, 2023 06:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

