Anushka Shetty New Movie: పాన్ ఇండియా మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అనుష్క, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తెరకెక్కిస్తున్న క్రిష్, ఫ‌స్ట్ లుక్ ఇదుగో!

తెలుగులో ఏ సినిమా చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా క్రిష్ (Krish) దర్శకత్వంలో అనుష్క సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ‘ఘాటీ'(Ghaati) అనే టైటిల్ ప్రకటించారు.

Anushka Shetty New Movie: పాన్ ఇండియా మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అనుష్క, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తెరకెక్కిస్తున్న క్రిష్, ఫ‌స్ట్ లుక్ ఇదుగో!
Anushka Shetty New Movie (PIC@ Amazon Insta)

Hyderabad, March 20: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన అనుష్క (Anushka Shettey) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. తెలుగులో చాలా గ్యాప్ తీసుకొని గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. దీంతో అనుష్క ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. మొదటిసారి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది అనుష్క. ప్రస్తుతం ఆ సినిమా షూట్ తో బిజీగా ఉంది. అనుష్క మళ్ళీ నెక్స్ట్ తెలుగులో ఏ సినిమా చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా క్రిష్ (Krish) దర్శకత్వంలో అనుష్క సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ‘ఘాటీ'(Ghaati) అనే టైటిల్ ప్రకటించారు.

 

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

నిన్న అమెజాన్ (Amazon) ఈవెంట్ జరగగా అక్కడ ఈ ఘాటీ సినిమాని కూడా ప్రకటించారు. థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. ఈ సినిమా గురించి ప్రకటిస్తూ ఓ ఫస్ట్ లుక్ (First Look) కూడా రిలీజ్ చేసారు. ఇందులో అనుష్క చీర కట్టుకొని తలపై ముసుగు వేసికొని నడుస్తూ వెళ్లపోతున్నట్టు చూపించారు. ఈ లుక్ లో అనుష్క ఫేస్ చూపించలేదు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా కోసం అనుష్క ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు షూట్ మొదలుపెడతారో, ఎప్పుడు వస్తుందో చూడాలి.

(The above story first appeared on LatestLY on Mar 20, 2024 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).