Bigg Boss-5 Telugu: బిగ్ బాస్-5 తెలుగు విన్నర్ గా వీజే సన్నీ, రన్నరప్ కు షణ్ముక్, సన్నీకి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్, రూ. 25లక్షలు విలువ చేసే ఫ్లాట్, టీవీఎస్ స్పోర్ట్స్ బైక్, అంగరంగ వైభవంగా బిగ్ బాస్ ఫైనల్స్
బిగ్ బాస్-5(Bigg Boss-5 Telugu) తెలుగు విన్నర్ (bigg boss-5 telugu winner)ఎవరో తేలిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్స్ వరకు వెళ్లిన వీజే సన్నీ( VJ Sunny) ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. సెప్టెంబర్ 5న మొదలైన ఈ షో.. 105 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. చివరి రోజు చివరి ఎపిసోడ్ అత్యంత ఆహ్లాదకరంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు.
Hyderabad December 19: బిగ్ బాస్-5(Bigg Boss-5 Telugu) తెలుగు విన్నర్ (bigg boss-5 telugu winner)ఎవరో తేలిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్స్ వరకు వెళ్లిన వీజే సన్నీ( VJ Sunny) ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. సెప్టెంబర్ 5న మొదలైన ఈ షో.. 105 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. చివరి రోజు చివరి ఎపిసోడ్ అత్యంత ఆహ్లాదకరంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఎంతో మంది అతిరథ మహారథులు వచ్చి కంటెస్టెంట్స్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటే విన్నర్ ఎవరు అవుతారు అని ఆసక్తిగా తెలుగు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు.
ఇక ముందు నుంచి వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి. బిగ్‌బాస్ 5 తెలుగు విజేత(bigg boss-5 Telugu)గా VJ సన్నీ( VJ Sunny) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఇంట్లోకి వచ్చిన ఈ కంటెస్టెంట్ అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బయటకు ఒకలా.. లోపల మరొకలా కాకుండా ఎమోషన్ ప్రేమ కోపం అన్ని చూపించాడు సన్నీ. దాపరికం లేకుండా అందరితోనూ అద్భుతంగా ఉన్నాడు. ఇదే ఈయనను విజయం వైపు అడుగులు వేసేలా చేసింది
నిజానికి బిగ్‌బాస్ సగం సీజన్ అయిపోయేంత వరకు కూడా సన్నీపై ఎలాంటి అంచనాలు లేవు. అందరి ఫోకస్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి(Anchor Ravi), షణ్ముఖ్ జస్వంత్(Shanmuk Jaswanth) పైనే ఉంది. కానీ ఒక్కొక్క వారం గడుస్తున్న కొద్దీ తనను తాను ఇంకా మెరుగుపరుచుకుని విజేతగా నిలిచాడు సన్నీ. చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈయన. ఓటింగ్ పరంగా కూడా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది. 30 శాతం ఓటింగ్ షణ్ముఖ్ జస్వంత్(Shanmuk Jaswanth) వైపు ఉంది. విజేత సన్నీని నాగార్జున అధికారికంగా స్టేజిపై ప్రకటించాడు. స్వయంగా ఆయన ఇంటి లోపలికి వెళ్లి ఇద్దరూ ఫైనలిస్టులను బయటకు తీసుకొచ్చాడు.
సన్నీకి 50 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు బిగ్‌బాస్ ట్రోఫీ.. షాద్ నగర్‌లో సువర్ణభూమి వాళ్ల తరపు నుంచి 25 లక్షల ఫ్లాట్ గిఫ్‌ట్‌గా వచ్చింది. సన్నీ గెలవగానే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. మాజీ ఇంటి సభ్యులు కూడా చాలా మంది సన్నీ గెలవాలని కోరుకున్నారు. అదే జరగడంతో పండగ చేసుకున్నారు కంటెస్టెంట్స్.
(The above story first appeared on LatestLY on Dec 19, 2021 11:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

