VJ Sunny Viral Video: బిగ్ బాస్ ఫేమ్ విజే సన్నీ వీడియో వైరల్, నోట్ల కట్టలను బ్యాగులో వేసుకుని కారులో వెళుతున్న క్లిప్ వైరల్, నిజమా కాదా అనే సందిగ్ధంలో ఫ్యాన్స్
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-5 విజేత వీజే సన్నీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు కట్టలతో ఉన్న ఓ బ్యాగును తీసుకెళుతుండగా, జారిపడడంతో ఆ నోట్ల కట్టలను మళ్లీ బ్యాగులో వేసుకుని సన్నీ తన కారులో వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది.
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-5 విజేత వీజే సన్నీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు కట్టలతో ఉన్న ఓ బ్యాగును తీసుకెళుతుండగా, జారిపడడంతో ఆ నోట్ల కట్టలను మళ్లీ బ్యాగులో వేసుకుని సన్నీ తన కారులో వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది. ఇది ఓ అపార్ట్ మెంట్ దగ్గర కెమెరాల్లో రికార్డయినట్టు తెలుస్తోంది. అయితే ఇది నిజమైన వీడియోనేనా లేక ఏదయినా ప్రచారం కోసం చిత్రీకరించిందా? అనేది స్పష్టత లేదు.
సన్నీ ప్రస్తుతం డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'అన్ స్టాపబుల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, తాజా వీడియో కూడా తన సినిమా కోసం చేసిన ప్రమోషన్ అయ్యుంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తూ, చర్చనీయాంశంగా మారింది.ఇది అతని సినిమా మార్కెటింగ్ ప్రచారంలో భాగమని అభిమానులు నమ్మకంగా సూచిస్తున్నారు. వాస్తవం ఏమిటో తెలుసుకోవాలంటే, మనం చేయాల్సిందల్లా వేచి చూడడమే.
Here's Video
(The above story first appeared on LatestLY on Jan 05, 2023 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

