Biggboss 7 Telugu Promo: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! అంటున్న నాగార్జున, వినూత్నంగా బిగ్‌ బాస్‌ సీజన్ 7 ప్రోమో రిలీజ్‌, కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది అంటూ ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు. ‘స్టార్ మా’లో బిగ్‌బాస్ టెలికాస్ట్ కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.

Biggboss 7 Telugu Promo: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! అంటున్న నాగార్జున, వినూత్నంగా బిగ్‌ బాస్‌ సీజన్ 7 ప్రోమో రిలీజ్‌, కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే
Biggboss 7 Telugu Promo (PIC Star Maa)

Hyderabad, July 19: తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది అంటూ ఇటీవలే ఓ మోషన్ వీడియోని రిలీజ్ చేశారు. ‘స్టార్ మా’లో బిగ్‌బాస్ టెలికాస్ట్ కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుదా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. గత నాలుగు సీజన్ల నుంచి ఈ షోకి నాగార్జునే(Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ ప్రోమో షూట్ కూడా నాగార్జునతో పూర్తి చేయగా తాజాగా ఓ చిన్న ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకొని బిగ్‌బాస్ సీజన్ 7 వచ్చేస్తుంది. ఈ సారి కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ చెప్పారు. దీంతో ఈ సారి ఏదో కొత్త థీమ్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ బిగ్‌బాస్ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.

అధికారికంగా తెలియకపోయినా బిగ్‌బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్… అమరదీప్ – తేజస్విని జంట, సీరియల్ ఆర్టిస్ట్ శోభిత శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి.. ఇలా మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ షో మొదలయ్యేవరకు కూడా ఫైనల్ కంటెస్టెంట్స్ పేర్లు అధికారికంగా బయటకు రావు. ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సెట్ వర్క్ పూర్తవుతుంది. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ ప్రారంభమవుతుందని సమాచారం.

(The above story first appeared on LatestLY on Jul 19, 2023 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).