Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు ? సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు అంటూ ప్రోమో, త్వరలో జెమెని టీవీలో ప్రారంభం కానున్న షో

జెమిని టీవీ షో పేరును కొంత మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుతో (Evaru Meelo Koteeswarulu) ముందుకు తీసుకు వస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్‌ చేసింది. 'సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..' అంటూ వీడియో వదిలింది.

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు ? సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు అంటూ ప్రోమో, త్వరలో జెమెని టీవీలో ప్రారంభం కానున్న షో
Evaru Meelo Koteeswarulu (Photo-Twitter)

బుల్లితెరపై అత్యంత పాపులారిటీనీ సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న షో ఏదైనా ఉందంటే అది మీలో ఎవరు కోటీశ్వరుడు (Meelo Evaru Koteeswarudu) మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విజయవంతమైన ఈ షో హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌పతిగా ప్రసారమవుతోంది.

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో అక్కడ సూపర్‌ సక్సెస్‌ సాధించింది. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఇక్కడ కూడా విజయవంతమైంది. ఇప్పుడు తాజాగా ఇది మరో సీజన్ లో కాస్త పేరు మార్చుకుని వస్తోంది.

జెమిని టీవీ షో పేరును కొంత మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుతో (Evaru Meelo Koteeswarulu) ముందుకు తీసుకు వస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్‌ చేసింది. 'సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..' అంటూ వీడియో వదిలింది. కాగా ఈ సీజన్‌కు యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR NTR) హోస్ట్‌గా రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Here's Promo Video

త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన రంగంలోకి దిగితే టీఆర్పీలు ఆకాశాన్ని అంటడం ఖాయమని చెప్తున్నారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. ఈ షో ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

మన తరఫున నిలబడగల నిజం మనిషిరా.., సత్యమేవ జయతే సాంగ్ విడుదల, వకీల్ సాబ్ చిత్రం నుంచి వచ్చిన మరో గీతం ఇది, ఏప్రిల్ 9న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ

కొద్ది సేప‌టి క్రితం బిగ్గెస్ట్ మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్ షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అంటూ ఓ ప్రోమో విడుద‌ల చేయ‌గా, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్‌ని పూర్తిగా రివీల్ చేయ‌కుండా, షాడో రూపంలో చూపించారు. ఇప్పటికే ఎన్టీఆర్‌కు సంబంధించి ప‌లు ప్రోమోస్ షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్రివిక్ర‌మ్ వీటిని డైరెక్ట్ చేయ‌గా, రానున్న రోజుల‌లో ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌నున్నారు. ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే తారక్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు అని సమాచారం. కరోనా కారణంగా గతేడాదే మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు రిలీజ్ అవుతుంది.

(The above story first appeared on LatestLY on Mar 07, 2021 05:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).