Vakeel Saab First Look (Photo Credits: Twitter)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నుంచి మరో గీతం విడుదలైంది. "మన తరఫున నిలబడగల నిజం మనిషిరా.." అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం ఆన్ లైన్ లో పంచుకుంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. బాలీవుడ్ లో ప్రజాదరణ పొందిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు.

ఇందులో పవన్ (Pawan Kalyan) సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా... అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కథకు అవసరమైన కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ పాట (Sathyameva Jayathe Song Released) ఇప్పుడు యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది. లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా ఈ పాట రాయించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉండటంతో సత్యమేవ జయతే పాట జనసేన పార్టీకి కూడా బాగానే పనికొచ్చేలా కనిపిస్తుంది.

పేదోళ్ల తరఫున నిలబడతాడు.. నిజం మనిషిరా.. కష్టమంటే వెంటనే అండగా ఉంటాడు.. అసలు మనిషిరా అంటూ రామజోగయ్య కలం నుంచి పవర్ ఫుల్ పదాలు జాలువారాయి. మరోవైపు థమన్ కూడా పవన్ అభిమానులు కోరుకునేలా బీట్ ఇచ్చాడు. ఈ పాట (Sathyameva Jayathe) ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. #VakeelSaab హ్యాష్‌టాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

కోర్టులో వాదించడం తెలుసు, కోట్ తీసి కొట్టడమూ తెలుసు' పవర్‌ఫుల్ టీజర్‌తో వచ్చిన 'వకీల్ సాబ్', పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండగ గిఫ్ట్

జన జన జన.. జనగణమున కలగలిసిన జనం మనిషిరా..

మన మన మన.. మన తరపున నిలబడగల నిజం మనిషిరా..

నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా..

పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా..

వదలనే వదలడు.. ఎదురుగా తప్పు జరిగితే..

ఇతనిలా.. ఓ గలం మన వెను దన్నై పోరాడితే..

సత్యమేవ జయతే.. సత్యమేవ జయతే..'' అనే లిరిక్స్‌తో వచ్చిన ఈ పాట ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.