మల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అటు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ రంగంలోకి దిగి కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.
జబర్దస్త్, మల్లెమాల సంస్థ కేవలం వ్యాపారం చేస్తోందని, కంటెస్టెంట్లకు ఎంత కష్టం వచ్చినా నాగబాబు మాత్రమే వెనక నిలబడ్డారని ఆర్పీ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు మల్లెమాల అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి పై కూడా కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే మల్లెమాల సంస్థ మీద కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా జబర్దస్ద్ కంటెస్టెంట్స్ హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వెనకేసుకొచ్చారు. ఆర్పీ ఎందుకిలా అవాకులు చెవాకులు పేలుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. తామంతా జబర్దస్త్ బిడ్డలం అని ఆర్పీ ఈ రోజు అన్నం తింటున్నాడంటే దాని వెనుక మల్లెమాల ప్రొడక్షన్ పెట్టిన భిక్ష అని చెప్పుకొచ్చారు. అంతేకాదు అన్నం తిన్న నోటితో అశుద్ధం కక్కడం సిగ్గు చేటు అని విమర్శించారు.
ఆర్పీ అసలు ఎవరని, శ్యాంప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడే రేంజ్ ఉందా అని అన్నారు. శ్యాం ప్రసాద్ రెడ్డి ఒక శిఖరం అని టాప్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక మాజీ సీఎం అల్లుడు అన్న సంగతి మర్చిపోవద్దని అన్నారు. ఒక టవరింగ్ పర్సనాలిటీని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడటం కరెక్ట్ కాదని హైపర్ ఆది అన్నారు.
గేటు బయట నిలబడి అవకాశాల కోసం అడుక్కున్న ఆర్పీని గేటు లోపలికి ఎవరు పంపించారు. ఎవరు అవకాశాలు ఇచ్చారు. అనే విషయాలు గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పుకొచ్చారు.
మల్లెమాల ప్రొడక్షన్ ఫుడ్ బాగోలేదని కిర్రాక్ ఆర్పీ చేసిన ఆరోపణల పై స్పందిస్తూ ఇంట్లో రోజు తినే ఐటమ్స్ ఒక్కో రోజు బాగోక పోవచ్చు అంతమాత్రాన అది చెత్త అనుకుంటే ఎలా, అని అన్నారు.