Jabardasth Punch Prasad: విషమంగా జబర్దస్త్ నటుడు ఆరోగ్యం, నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌, కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ లో పంచ్‌ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్‌ ప్రసాద్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన (Jabardasth Comedian) నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు

Jabardasth Punch Prasad: విషమంగా జబర్దస్త్ నటుడు ఆరోగ్యం, నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌, కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్
Jabardasth Comedian Punch Prasad (Photo-Video Grab)

జబర్దస్త్ లో పంచ్‌ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్‌ ప్రసాద్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన (Jabardasth Comedian) నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు.కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్‌తో (kidney failure) బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్‌లో వాడి అందరిని నవ్వించాడు.

ప్రసాద్‌ను (Jabardasth Comedian Punch Prasad) గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్‌ ప్రసాద్‌ పరిస్థితి ప్ర​స్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో అతడు ఉన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ చానల్‌ షేర్‌ చేసిన వీడియోలో పంచ్‌ ప్రసాద్‌ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో కనిపించాడు.

కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు, తనను అన్యాయంగా గెంటేశారని తెలిపిన జబర్దస్త్ కమెడియన్ అప్పారావు

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్‌లో కమెడియన్ జోడీ నూకరాజు ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు.

అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రసాద్‌కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని కోరాడు.

(The above story first appeared on LatestLY on Nov 18, 2022 06:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).