Sudigali Sudheer on Marriage: పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదంటూ సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్, రష్మితో పెళ్లి గురించి జబర్దస్త్ నటుడి సమాధానం ఇదిగో..
రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్.. కాలింగ్ సహస్ర మూవీ ఈవెంట్లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్లో రష్మితో పెళ్లెప్పుడు? అనే ప్రశ్న సుధీర్‌కి ఎదురైంది. దీనికి అతను ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చాడు.ఈ ప్రశ్న నాకు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందుకు థ్యాంక్స్.
రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ దేవుడు, నన్ను పెళ్లి వైపు తిప్పితే చేసుకుంటానేమో' అని సుధీర్ క్లారిటీ ఇచ్చేశాడు.
దీంతో పాటుగా రష్మీతో సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఇద్దరికి తగ్గ కథ కోసం చూస్తున్నామని, దొరికినప్పుడు కచ్చితంగా కలిసి నటిస్తామని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు.కాగా సుధీర్ హీరోగా నటించి కాలింగ్ సహస్ర' మూవీ డిసెంబరు 1న థియేటర్లలోకి రాబోతోంది. గాలోడు' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ ఈ చిత్రంతో ఇంకా పాపులారీటీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు.
కాలింగ్ సహస్ర సినిమాతో కథానాయికగా 'డోలీషా' పరిచయమవుతోంది. ఇంటర్వ్యూలో సినిమా గురించి సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ .. "ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ... మంచి లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి .. కొంచెం ఫన్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి కూడా. ఈ సినిమాలో నా పాత్ర కామెడీ చేయదు .. సీరియస్ గానే సాగుతుంది. అందువలన నేను కొత్తగా అనిపిస్తాను" అని అన్నాడు.ఈ సారి నేను చేసే ప్రయోగంగానే ఈ సినిమాను భావిస్తాను. తప్పకుండా నన్ను ఈ తరహా పాత్రలలో ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది" అన్నాడు.
ఇక హీరోయిన్ డోలీషా మాట్లాడుతూ, సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి విన్నాను. ఆ తరువాత ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది" అని చెప్పింది.
(The above story first appeared on LatestLY on Nov 22, 2023 07:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

