Kaun Banega Crorepati 14: అమితాబ్ బచ్చన్ ముందే షర్ట్ విప్పేసిన కంటెస్టెంట్, ఇంకా బట్టలు విప్పేస్తారేమోనని భయంగా ఉందన్న బిగ్ బి, కౌన్ బనేగా కరోడ్‌పతి 14లో ఆసక్తికర ఘటన
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14 లో (Kaun Banega Crorepati 14) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14 లో (Kaun Banega Crorepati 14) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హాట్ సీట్‌కు ఎంటర్ అయ్యేందుకు ఫాస్టేస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో గెలుపొందిన ఓ వ్యక్తి షర్డ్ విప్పి స్టేజ్‌పై హంగామా చేశాడు. అతన్ని చూసి బిగ్‌బి ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
ఈ వీడియోలో అమితాబ్ విజయ్ గుప్తా అనే కంటెస్టెంట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో (Contestant Removes Shirt After Winning ) గెలిచినట్లు అనౌన్స్ చేశారు. అది విన్న ఆ వ్యక్తి సంతోషం పట్టలేక స్టేజ్‌పై రచ్చ రచ్చ చేశాడు. దీంతో స్టేజ్‌పైకి వస్తూనే షర్ట్ విప్పి స్టేజ్ చూట్టు తిరిగాడు. అంతేకాదు తన భార్య దగ్గరికి వెళ్లి ఆనందంతో హగ్ చేసుకున్నాడు. దాదాపు 45 ఏళ్లపైనే ఉండే ఈ వ్యక్తి ఒక్కసారిగా కుర్రాడిలా మారిపోయాడు.
ఆయనను అలా చూసి షో హోస్ట్ బిగ్‌బితో పాటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అతను మాత్రం చప్పట్లు కొట్టడం ఆపకండి అని ఆడియన్స్‌కు చెప్పుతూ స్టేజ్ అంతా పరుగెడుతూ నానా హంగామా చేశాడు.
Here's Video
Vijay Gupta ji ne jeet mein shirt utaar ke machayi dhamaal, lekin kya apne gyan se hotseat par woh karenge kamaal?
Dekhiye #KaunBanegaCrorepati, aaj raat 9 baje, sirf Sony par.#KBC2022@SrBachchan pic.twitter.com/FpP2J7M8Is
— sonytv (@SonyTV) August 25, 2022
హోస్ట్ అమితాబ్ సర్ కనీసం షర్ట్ అయినా వేసుకోండని అతడిని కోరారు. ఆ తర్వాత ‘కనీసం ఆయనను షర్ట్ వేసుకోనివ్వండి.. లేదంటే ఇంకా బట్టలు విప్పేస్తారేమోనని భయంగా ఉంది’ అని బిగ్‌బి చమత్కరించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
(The above story first appeared on LatestLY on Aug 26, 2022 06:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

