Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటిశ్వ‌రుడు, తొలిసారిగా కోటి రూపాయలు గెలుచుకున్న పోలీస్ అధికారి రవీంద్ర, తెలుగు టీవీ గేమ్ షోల చరిత్ర‌లో ఇదే ఫస్ట్ టైం..

జెమినీ టీవీలో వస్తున్న ఎవరు మీలో కోటిశ్వ‌రుడు గేమ్ షోలో (Evaru Meelo Koteeswarulu) తెలంగాణ‌ కొత్తగూడెంకు చెందిన‌ ఓ పోలీస్ అధికారి కోటి రూపాయ‌ల న‌గ‌దు గెలుచుకున్నాడు.కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బీ రాజార‌వీంద్ర (Kottagudem Sub Inspector B Raja ravindra) అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు.

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటిశ్వ‌రుడు, తొలిసారిగా కోటి రూపాయలు గెలుచుకున్న పోలీస్ అధికారి రవీంద్ర, తెలుగు టీవీ గేమ్ షోల చరిత్ర‌లో ఇదే ఫస్ట్ టైం..
Evaru Meelo Kotteswarulu (Photo-Gemnitv)

జెమినీ టీవీలో వస్తున్న ఎవరు మీలో కోటిశ్వ‌రుడు గేమ్ షోలో (Evaru Meelo Koteeswarulu) తెలంగాణ‌ కొత్తగూడెంకు చెందిన‌ ఓ పోలీస్ అధికారి కోటి రూపాయ‌ల న‌గ‌దు గెలుచుకున్నాడు.కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బీ రాజార‌వీంద్ర (Kottagudem Sub Inspector B Raja ravindra) అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు. తెలుగు టెలివిజ‌న్ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే ఓ గేమ్ షోలో ఒక వ్య‌క్తి ఇంత భారీగా ప్రైజ్ మ‌నీ గెలువ‌డం ఇదే తొలిసారి. దాంతో తెలుగు టీవీ గేమ్ షోల చరిత్ర‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి కంటెస్టెంట్‌గా ( Evaru Meelo Kotteswarulu for first time ) ఆయ‌న‌ చ‌రిత్ర సృష్టించాడు.

జూనియ‌ర్ ఎన్‌టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు గేమ్ షో జెమినీ టీవీలో ప్ర‌సారం అవుతున్న‌ది. ఈ షోలో పాల్గొన్న ఎస్సై రాజార‌వీంద్ర ఏకంగా కోటి రూపాయ‌ల ప్రైజ్ మ‌నీ (B Raja ravindra wins Rs 1 crore in Evaru Meelo Kotteswarulu) గెలిచి.. తెలుగు టీవీ గేమ్ షోలో భారీగా న‌గ‌దు గెలిచిన తొలి వ్య‌క్తిగా నిలిచాడు. సాధార‌ణ పార్టిసిపెంట్స్, సెలెబ్రిటీ పార్టిసిపెంట్స్‌లో ఎవ‌రు కూడా ఇంత‌వ‌ర‌కు రూ. కోటి ప్రైజ్ మ‌నీగా గెలుచుకోలేదు. దాదాపు గ‌త రెండు నెల‌లుగా కొన‌సాగుతున్న ఈ గేమ్ షోలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది కంటెస్టెంట్‌లు పార్టిసిపేట్ చేశారు. అయితే వీరంతా వేలు, ల‌క్ష‌ల్లో మాత్ర‌మే న‌గ‌దు బ‌హుమ‌తి గెలుచుకోగ‌లిగారు. కానీ రాజార‌వీంద్ర ఒక్క‌డే కోటి రూపాయ‌లు గెలుచుకున్నాడని జెమినీ టీవీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

నా డ్రస్ కోడ్ మీకు నచ్చేలేదా, మీ తాగుబోతు తనం మంచిగా ఉందా, కోట శ్రీనివాసరావుపై మండిపడిన యాంకర్ అనసూయ, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని హితవు

రాజార‌వీంద్ర పోలీస్ డిపార్టుమెంటులో ప‌నిచేస్తూనే అనేక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాడు. పోలీస్ కాంపిటీష‌న్స్‌లో ఇప్ప‌టికే జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో ఎన్నో బ‌హుమ‌తులు సాధించాడు. ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ ప‌త‌కం గెలువాల‌న్న‌ది రాజార‌వీంద్ర క‌ల‌ అని షో ప్రసారంలొ తెలిపాడు. ఎవ‌రు మీలో కోట్వీరుడు గేమ్ షోలో గెలిచిన ప్రైజ్ మ‌నీని త‌న క‌ల‌ నెర‌వేర్చుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటాన‌ని అనంతరం ఆయ‌న చెప్పాడు. రాజారవీంద్ర ప్రైజ్ మ‌నీ గెలిచిన ఎపిసోడ్ సోమ‌, మంగ‌ళవారాల్లో (రేపు, ఎల్లుండి) రాత్రి 8.30 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.

(The above story first appeared on LatestLY on Nov 15, 2021 01:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).