Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ను పిలిచి అవమానించారా, ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్
బుల్లితెర పవర్ స్టార్ అంటే సుడిగాలి సుధీర్.. అతడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, అటు వెండితెర మీద కూడా హీరోగా రాణిస్తున్నాడు.
బుల్లితెర పవర్ స్టార్ అంటే సుడిగాలి సుధీర్.. అతడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, అటు వెండితెర మీద కూడా హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా రిలీజైన్ పండుగాడు సినిమా సహా పలు సినిమాల్లో హీరోగా సుధీర్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మాటీవీలో సుధీర్ కనిపిస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా పరిచయం అయిన సుధీర్ తన కామెడీ టైమింగ్ తో పాటు రష్మీ గౌతంతో రొమాన్స్ ద్వారా ప్రేక్షకులను ఎంతో మెప్పించాడు.
నిజానికి సుధీర్ ని మల్టీ టాలెంటెడ్ అని ఇండస్ట్రీలో అంటారు. ఎందుకంటే ఈటీవీ జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న సుధీర్.. ప్రస్తుతం వెండి తెరపై కూడా రాణిస్తున్నాడు. సుధీర్ సినిమాల వైపు వెళ్లడానికి కారణం జబర్దస్త్ అని చెప్పవచ్చు. బుల్లితెరపై వరుస ఆఫర్లు అందుకుంటూ.. ప్రస్తుతం హీరోగా హడావిడి చేస్తున్నాడు సుధీర్. .
ఇక జబర్దస్త్ ను సుధీర్ వదిలి వెళ్ళడం చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా మల్లెమాల టీం, పై సుధీర్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. సుధీర్ కు మంచి జీవితాన్ని అందించిన జబర్దస్త్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షో ను వదిలి వెళ్ళినందుకు అటు మల్లెమాల మేనేజ్మెంట్ సైతం చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈటీవీ వార్షికోత్సవం సందర్భంగా సుడిగాలి సుధీర్ హాజరయ్యాడు. అలా సుడిగాలి సుధీర్ రావడాన్ని చూసి తన అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ ను ఆ కార్యక్రమంలో కొంతమంది అవమానించారంటూ వార్తలు వస్తున్నాయి.
సుధీర్ కి తగినంత మర్యాద ఇవ్వకుండా తనను అవమానించారని తెలుస్తుంది. అంతేకాకుండా సుధీర్ కనపడకుండా స్కిట్ ను ఎడిట్ చేయడం ద్వారా, అతడిని మరింత అవమానపరిచినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం తెలిసిన సుడిగాలి సుధీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఏదేమైనా సుధీర్ మాత్రం వెండి తెరపై హీరోగా హడావిడి చేస్తున్నాడు.
(The above story first appeared on LatestLY on Sep 04, 2022 07:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

