RJ Shekar Bhasha Arrest: బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అరెస్ట్, హర్షసాయి కేసులో బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Hyderabad, OCT 18: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను (RJ Shekar bhasha) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో (Harsha Sai Case) విచారణ చేస్తున్నట్లు సమాచారం. హర్షసాయి తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగి పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. అయితే బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime police) నాలుగు గంటలకు పైగా విచారిస్తున్నారు. కాగా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్-8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆర్జే శేఖర్ భాషా రెండోవారంలోనే ఎలిమినేట్ అయి బయటకొచ్చేశాడు.
(The above story first appeared on LatestLY on Oct 18, 2024 11:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

