RRB Exams 2020: డిసెంబర్ 15 నుంచి 23 మధ్య ఆర్‌ఆర్‌బి పరీక్షలు, అభ్యర్థులకు ఎలాంటి కాల్ లెటర్ పంపరు, rrbcdg.gov.in నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపిన ఇండియన్ రైల్వే
ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌బి పరీక్షలు డిసెంబర్ 15 నుంచి 23 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే అభ్యర్థలకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపబడవని నేరుగా ఆర్ఆర్బీ వెబ్ సైట్ rrbcdg.gov.in అబ్యర్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది.
ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌బి పరీక్షలు డిసెంబర్ 15 నుంచి 23 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే అభ్యర్థలకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపబడవని నేరుగా ఆర్ఆర్బీ వెబ్ సైట్ rrbcdg.gov.in అబ్యర్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది. రైల్వేలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులతో పాటు పెండింగ్‌లో ఉన్న నియామక పరీక్షల్ని డిసెంబర్ 15 నుంచి నిర్వహిస్తామని ఇప్పటికే ఆర్ఆర్‌బీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు అక్టోబర్ 15 నుంచి 20 వరకు లింక్ అందుబాటులో ఉంచింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఎగ్జామ్ డేట్స్ ప్రకటించింది. ఈ పోస్టులకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, ఫర్మామెన్స్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు తెలుసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ పాస్‌ను కూడా 10 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు విడుదల చేస్తారు.
ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ నోటిఫికేషన్ ద్వారా 1663 జూనియర్ స్టెనోగ్రాఫర్-హిందీ, ఇంగ్లీష్, ట్రాన్స్లేటర్, కుక్, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, టీచర్, లా అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి గతేడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇక మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే కాదు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. త్వరలో ఎన్టీపీసీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశముంది.
ఆర్‌ఆర్‌బి అధికారిక సమాచారం ప్రకారం RRB NTPC పరీక్ష కోసం 35,208 పోస్టులకు 1.2 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే గ్రూపు డీ పోస్టుల్లో ఉన్న 1,03769 వేకన్సీల కోసం 1,15,67,248 అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరి కింద 1663 ఖాళీల కోసం 1,02,940 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
(The above story first appeared on LatestLY on Nov 30, 2020 03:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

