TS EDCET Result 2022 Out: టీఎస్ ఎడ్‌సెట్–2022 ఫలితాలు విడుదల, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఐసెట్ ఫలితాలు, edcet.tsche.ac.in ద్వారా EdCET ఫలితాలు చెక్ చేసుకోండి
తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు.
ఇక ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐ-సెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జులై 28న తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 76,160మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత పరీక్షకు 90.93 శాతం, రెండో విడత పరీక్షకు 91.43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఐసెట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఆగస్టు 4న విడుదల చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 26, 2022 08:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

