TS ICET 2021: తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు, ఈనెల 7 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్‌ 17న ఐసెట్‌ ఫలితాలు
TS ICET 2021 Full Schedule Released | File Photo

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ (TS ICET 2021) నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణలో ఐసెట్‌ పరీక్షలు (Telangana ICET 2021 notification) నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు (TSICET Notification 2021) చేసుకోవచ్చు.

ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం ఇచ్చారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు 8 ఆగస్టు నుండి 11 ఆగస్టు వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్‌ 17న ఐసెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 14 రీజినల్‌ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్‌ నిర్వహణ కోసం ఇప్పటికే 60 కేంద్రాలను గుర్తించినట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 13 నుంచి నిర్దేశిత వెబ్ సైట్ (https://icet.tsche.ac.in) ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఐసెట్ ను ఈసారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

ఇకపై అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, కామన్ ఎలిజబుటిటీ టెస్ట్‌ని సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం

కాగా, ఇటీవల ఐసెల్‌ 2021 షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఎంసీఏ, ఎంబీఏ సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది.