TS Inter Exams 2022: తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు, సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు, పూర్తి వివరాలు కథనంలో..
తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది.
ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. కరోనా నిబధంలనలు పాటించాలని సూచించారు. తెలంగాణలో ఒంటిపూట బడులు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగనున్న స్కూల్స్
ఫస్టియర్ షెడ్యూల్ : మే 6(శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్
► మే 9(సోమవారం) – ఇంగ్లీష్
► మే 11(బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
► మే 13(శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
► మే 16(సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
► మే 18(బుధవారం) – కెమిస్ట్రీ, కామర్స్
► మే 20 (శుక్రవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
► మే 23(సోమవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
సెకండియర్ షెడ్యూల్
► మే 7(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
► మే 10(మంగళవారం) – ఇంగ్లీష్
► మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
► మే 14(శనివారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
► మే 17(మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
► మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామర్స్
► మే 21 (శనివారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
► మే 24(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
(The above story first appeared on LatestLY on Mar 16, 2022 02:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

