TS SSC Result 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది, జూన్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు అధికారులు, జులై 1న టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల (Telangana SSC result 2022 ) కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను (TS SSC Result 2022) విడుదల చేయనున్నారు.
Telangana SSC Result 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల (Telangana SSC result 2022 ) కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను (TS SSC Result 2022) విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.
ఇక జూన్ 12న నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. జులై 1వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. టెట్ ఫలితాల వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1న విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్ఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Jun 28, 2022 07:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

