Indian Railways: వాట్సాప్ నంబర్‌తో పుడ్ ఆర్డర్ చేయవచ్చు, త్వరలో రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ సౌకర్యం, చాట్‌బోట్ సేవలను ప్రారంభిస్తున్న IRCTC
రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది. వాట్సాప్ నంబర్‌తో కావాల్సిన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసే సౌకర్యం రైలు ప్రయాణీకులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బోట్ ప్రయాణికులకు మీల్స్‌ను బుక్ చేస్తుంది
రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది. వాట్సాప్ నంబర్‌తో కావాల్సిన ఆహారపదార్థాలను ఆర్డర్ చేసే సౌకర్యం రైలు ప్రయాణీకులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బోట్ ప్రయాణికులకు మీల్స్‌ను బుక్ చేస్తుంది.ఈ కేటరింగ్ సేవల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్ www.catering.irctc.co.in తోపాటు ఈ–కేటరింగ్ యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపింది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేయొచ్చు.
ఇప్పటికే కొన్ని నిర్దిష్ట రూట్లలో ఐఆర్సీటీసీ.. +91 8750001323 ఫోన్ నంబర్‌పై వాట్సాప్ ద్వారా మీల్స్ అందిస్తున్నది.ఈ ఫోన్ నంబర్ వాట్సాప్ ద్వారా మీల్స్ ఆర్డర్ మెసేజ్ పెట్టిన ప్రయాణికులకు భోజనం అందిస్తున్నది. ఇ–టికెట్ బుక్ చేసుకుని, ఇ–కేటరింగ్ సేవలకు ఆప్షన్ ఇచ్చిన ప్రయాణికులకు వాట్సాప్ నంబర్ నుంచి మెసేజీ వెళ్తుంది. దాని ద్వారా ఆ మార్గంలోని స్టేషన్లలో నచ్చిన రెస్టారెంట్లలో మీల్స్ బుక్ చేసుకోవచ్చు.ప్రయాణికుల సూచనలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికుల ఈ-కేటరింగ్ సర్వీసులకు వాట్సాప్ కమ్యూనికేషన్ అందుబాటులోకి తెచ్చాం. మరికొన్ని రైళ్లలో ఈ సదుపాయం కల్పిస్తుంది` అని భారతీయ రైల్వేస్ సోమవారం ఓ ప్రకటన చేసింది.
ఆగని ఉద్యోగాల కోత, 2000 మంది ఉద్యోగులను తొలగించిన ఏవియేషన్ దిగ్గజం బోయింగ్
ప్రయాణికులు www.catering.irctc.co.in వెబ్‌సైట్‌లోని ఈ-కేటరింగ్ సర్వీసుల ఆప్షన్‌తో ఈ-టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. వారి మొబైల్ నంబర్‌కు ఒక బిజినెస్ వాట్సాప్ నంబర్ ద్వారా మెసేజీ వస్తుంది. ఈ వాట్సాప్ నంబర్‌పై ప్రయాణికులు తమకు సంబంధిత రూట్‌లోని స్టేషన్ల పరిధిలో అందుబాటులో ఉన్న రెస్టారెంట్ల నుంచి తమకు ఇష్టమైన మీల్స్ బుక్ చేసుకోవచ్చు.
రెండో దశలో ఇంటరాక్టివ్ వాట్సాప్ మీల్ బుకింగ్, డెలివరీకి భారతీయ రైల్వేస్ ప్రణాళిక రూపొందించాయి. ఇందులో వాట్సాప్ నంబర్.. తమ కస్టమర్‌కు ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెస్తుంది. తమకు అవసరమైన మీల్‌ను ఏఐ-పవర్డ్ చాట్‌బోట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి రోజూ ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సర్వీస్ వెబ్‌సైట్, యాప్ ద్వారా దాదాపు 50 వేల మందికి భోజనం డెలివరీ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 07, 2023 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

