AP Staff Nurse Recruitment 2022: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి (AP Staff Nurse Recruitment 2022) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన శుక్రవారం నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది.

AP Staff Nurse Recruitment 2022: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ
AP Government logo (Photo-Wikimedia Commons)

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియామకానికి (AP Staff Nurse Recruitment 2022) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన శుక్రవారం నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. పోస్టులకు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు అప్లికేషన్స్‌ను స్వీకరించనున్నారు. పూర్తి చేసిన అప్లికేషన్లను డిసెంబర్ 9లోగా ఆయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాలి.

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో మరో రెండు గ్రూప్స్ నోటిఫికేషన్లు, తాజాగా 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీపీఎస్సీ

ఇక, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వచ్చిన దరఖాస్తుల్లో ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను 19వ తేదీన తీస్తారు. అనంతరం, 20వ తేదీన సెలక్షన్‌ లిస్ట్‌ను తీసి.. డిసెంబర్‌ 21, 22వ తేదీల్లో కౌన్సిలింగ్‌, అపాంట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వనున్నారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌

రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల చిరునామాలు ఇవే..

విశాఖపట్నం ఆర్డీ కార్యాలయం: రీజనల్ డైరెక్టర్, బుల్లయ్య కాలేజీ ఎదురుగా, రేసపువానిపాలెం

రాజమండ్రి ఆర్డీ కార్యాలయం: జిల్లా ఆసుపత్రి ప్రాంగణం , రాజమండ్రి

గుంటూరు ఆర్డీ కార్యాలయం: పాత ఇటుకులబట్టి రోడ్ , అశ్విని ఆసుపత్రి వెనుక, గుంటూరు

వైఎస్సార్ కడప ఆర్డీ కార్యాలయం: పాత రిమ్స్ ప్రాంగణం, కడప

ఉద్యోగ అభ్యర్థులు జోన్ల వారీగా ఖాళీల వివరాల కోసం https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

(The above story first appeared on LatestLY on Dec 02, 2022 05:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).