Group-1 Mains Postponed: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా, జూన్ 3 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన విద్యాశాఖ
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది.
ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, కస్టమర్‌లు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించిన ఆర్బీఐ
యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Mar 28, 2023 03:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

