Bank Holidays in April 2023: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, కస్టమర్‌లు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించిన ఆర్బీఐ
RBI representational image (Photo Credit- PTI)

April Bank Holidays 2023: గుడ్ ఫ్రైడే, ఈద్, బాబా అంబేద్కర్ జయంతి వంటి వివిధ పండుగల నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో సగం నెల పాటు బ్యాంకులు మూతపడనున్న (Bank Holidays in April 2023) నేపథ్యంలో.. వచ్చే నెలలో తమ సంబంధిత బ్యాంకులను సందర్శించాలనుకుంటున్న బ్యాంక్ కస్టమర్‌లు తమ పనిని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.

బ్యాంక్ శాఖలు మూసివేయబడినప్పటికీ, లావాదేవీలు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. RBI బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తుంది– బ్యాంకుల ఖాతాలను మూసివేయడం, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద సెలవులు, రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సెలవులు. ఖాతాల వార్షిక ముగింపు, ఆర్థిక సంవత్సరం 2022-23 ముగింపుకు రావడంతో,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మార్చి 31న పనివేళలు ముగిసే వరకు అన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని ఆదేశించింది.

ఏప్రిల్ నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల.. ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో.. ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

అన్ని ఏజెన్సీ బ్యాంకులకు రాసిన లేఖలో, 2022–2023లో ఏజెన్సీ బ్యాంకులు అదే ఆర్థిక సంవత్సరంలో చేసే అన్ని ప్రభుత్వ లావాదేవీలు తప్పనిసరిగా లెక్కించబడాలని RBI రాసింది. దీని ప్రకారం, అన్ని ఏజెన్సీ బ్యాంకులు మార్చి 31, 2023 సాధారణ పని గంటల వరకు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన ఓవర్-ది-కౌంటర్ లావాదేవీల కోసం వారి నియమించబడిన శాఖలను తెరిచి ఉంచాలి" అని సెంట్రల్ బ్యాంక్ లేఖ పేర్కొంది.

గుడ్ న్యూస్, ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడి లింక్ తేదీ పొడిగించిన కేంద్రం, ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 లోపు లింక్ చేసుకోవాలని సూచన

ఆర్‌బీఐ (RBI) సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.

2023లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను దిగువన చూడండి.

ఏప్రిల్ 1: బ్యాంకులు వార్షిక మూసివేత అన్ని బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 2: ఆదివారం

ఏప్రిల్ 4: మహావీర్‌ జయంతి

ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్‌ రామ్ జయంతి

ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 8: రెండవ శనివారం

ఏప్రిల్ 9: ఆదివారం

ఏప్రిల్ 14: అంబేడ్కర్ జయంతి

ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరం (అగర్తలా, గౌహతి, కోల్‌కతా బ్యాంకులకు సెలవు)

ఏప్రిల్ 16: ఆదివారం

ఏప్రిల్ 18: షాబ్-ఎ-క్వార్డ్ (జమ్మూ, కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు).

ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్‌ ఈద్‌)

ఏప్రిల్ 22: నాలుగో శనివారం

ఏప్రిల్ 23: ఆదివారం

ఏప్రిల్ 30: ఆదివారం