Hyd, Sep 4: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ...పింక్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఇక తెల్లవారుజాము నుంచి మహబూబాబాద్ జిల్లాలో భారీగా కురుస్తుండటంతో బయ్యారం పెద్ద చెరువు ఉదృతంగా ప్రవహిస్తోంది. గార్ల మండలంలో పొంగి పొర్లుతోంది పాకాల వాగు. పాకాల వాగు హైలెవల్ బ్రిడ్జి పైనుంచి మత్తడి ప్రవహిస్తుండగా రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.దీంతో మహబూబాబాద్ డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. మేడారంలో భారీ వర్షం, వేల ఎకరాల్లో నేలకొరిగిన చెట్లు, డ్రోన్ వీడియో వైరల్
Here's Video:
Heavy to very heavy Rain in Sikh Village Secunderabad. I have witnessed water logging on this road for almost after 3 years. It's just massive. #HyderabadRains #hyderabad pic.twitter.com/yNUgcpKgNd
— The Food GlanZer (@JavedMohammeds) September 3, 2024
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. తిరిగి విద్యాసంస్థలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అన్నియాజమాన్య విద్యాసంస్థలు సెలవును ఖఛ్చిత్తంగా పాటించాలని..ఈ సదరు సమాచారాన్ని వెంటనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుత నీటిమట్టం 42.2 అడుగులకు చేరగా దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ...ఇబ్బందులు ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలన్నారు కలెక్టర్.
Here's Videos:
From Last One 1Hr...Heavy RainFall At
📍Bhadrachalam⛈️💦⚡
Bhadradri Kothagudem (Dist)#TelanganaRains #rains2024 @balaji25_t pic.twitter.com/E0zHItfto0
— Praveen_35 (@Praveen35184951) September 4, 2024
అర్ధరాత్రి తరవాత సిద్దిపేట జిల్లా కోహెడ లో వర్ష బీభత్సం @balaji25_t @tharun25_t @Rajani_Weather @Rainmaker1973 #siddipet pic.twitter.com/AXG9JfD50s
— Srikanth Marka (@SrikanthMarka6) September 4, 2024
సిద్దిపేట జిల్లాలో మళ్ళీ పొంగి పారుతున్న వాగులు@balaji25_t @Rajani_Weather @tharun25_t @MasRainman pic.twitter.com/JpIkFc3Ciw
— Srikanth Marka (@SrikanthMarka6) September 4, 2024
Here in Mancherial @balaji25_t pic.twitter.com/7p5oht43L9
— Mr Harsha (@MrHarsha8341) September 4, 2024
హుస్నాబాద్ రోడ్లు బస్ స్టాండ్ పరిస్థితి ఈ రోజు ఉదయం...🌨️ @balaji25_t @Rajani_Weather @MasRainman @tharun25_t #husnabad #TelanganaFloods pic.twitter.com/jmhIhtxZeg
— Srikanth Marka (@SrikanthMarka6) September 4, 2024