Tirumala, March 27: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ (Good news). ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను (Tirumala Special Darshan Tickets) నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ (Online) లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. ఒలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది.
Tirumala SED Rs300/- Tickets April Quota Update#TTD #TirumalaDarshanTickets #AprilMonth #Tirupati #SED #Rs300/-darshantickets pic.twitter.com/4vemf28v9F
— Tirupati Tirumala Info (@tirupati_info) March 25, 2023
30న శ్రీరామనవమి ఆస్థానం... 31న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం
ఇక మార్చి 30, 31వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి మరియు శ్రీరామపట్టాభిషేకం ఆస్థానాలు నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. మార్చి 30న హనుమంత వాహన సేవ ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా మార్చి 30న ఉదయం 9 నంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 31వ తేదీన రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారని పేర్కొంది.