Water Bandh in Hyderabad: అలర్ట్.. హైదరాబాద్ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రేపు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు.
Hyderabad, Nov 10: హైదరాబాద్ (Hyderabad) లోని పలు ప్రాంతాల్లో రేపు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు (Water Supply) అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండబోదని అధికారులు వెల్లడించారు. మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్టు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం మేరకు ప్రజలు తాత్కాలిక ప్రత్యామ్నాయాలను చేసుకోవాలని, ట్యాంకర్లలో నీటి లభ్యత అందుబాటులో ఉన్నదని వివరించారు. స్థానికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతాలపై ప్రభావం
ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్ పూర్, ఎర్రగడ్డ, కెపీహెచ్ బీ, మూసాపేట, చందానగర్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని అధికారులు తెలిపారు.
బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో రోడ్డు దాటుతున్న పాదచారుడు మృతి.. హైదరాబాద్ కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)
(The above story first appeared on LatestLY on Nov 10, 2024 05:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

