Kanuma Festival : కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకోవాలి? కనుమనాడు చేయకూడనివి, చేయాల్సినవి ఏమిటి?
సంక్రాంతి(Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు.
Hydearabad January 16: సంక్రాంతి(Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల భోగి,సంక్రాంతి, కనుమ(Kanuma)గా మరికొన్ని చోట్ల ముక్కనుమ అని నాలుగో రోజు పండుగను చేసుకుంటారు. అయితే మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు. అంతేకాకుండా పితృదేవతలనీ స్మరించుకుంటారు. వ్యవసాయం(Agriculture)లో రైతుకు సాయం చేసే పశువులకు కృతజ్ఞతలు చెప్పేందుకు కనుమను చేసుకుంటారు.
సంక్రాంతి(Sankranthi) అంటే మన పంటలు ఇంటికి చేరుకునే సమయం. పొలం పనులు పూర్తవుతాయి. ఇప్పటి వరకు పశువులు తమ శక్తినంతా ఉపయోగించి పంటలు చేతికి వచ్చేలా చేసిన పశువులకు ప్రస్తుతం విశ్రాంతి దొరుకుతుంది. చాలా కష్టపడి అలసి, నీరసమై పోయిన పశువులకు బలాన్ని చేకూర్చేందుకు ఉప్పుచెక్క పేరుతో వాటికి ఔషధులతో కూడిన పొట్టుని తినిపిస్తారు. మరోవైపు పశువులనీ, వాటి ఉంటే కొట్టాలనీ శుభ్రపరుస్తారు. కొట్టాలను గోమయంతోనూ, పూలదండలతోనూ అలంకరిస్తారు. రంగరంగుల అలంకరణలతో…కనుమ నాడు ముఖ్యంగా చేసే పని పశువుల అలంకరణ.
ఎద్దుల కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గంటల గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా తమ రంగరంగ వైభవంగా పశువులని అలంకరిస్తారు. పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం మనకు కనిపిస్తుంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేడాలడదీస్తారు. వాటితో చిన్నచిన్న పిట్టలు తమ కడుపుని నింపుకోవడం కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల పెద్దలను తలచుకోవడం చేస్తారు. వీటికి గారెలు, మినుమల పదార్థాలను వంటకాలుగా చేస్తారు. పంట రావడానికి సహాయం చేసిన అందరికీ కొత్త దుస్తులు పెట్టడం, వారిని ఇంటికి పిలిచి ఆదరించడం, కానుకలు ఇవ్వడం చేస్తుంటారు.
ఇక కనుమ(Kanuma) అంటే అందరికీ గుర్తొచ్చేది గారెలు. గారెలు, మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అయితే ఈ పండగ నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యద్దు అని అంటారు..? శుభకార్యాలు ఎందుకు చేయరాదు అంటారు..? ఇక ఈ విషయం లోకి వస్తే, సాధారణంగా కనుమ పండుగ రోజు గారెలు చేసి నివేదనగా అర్పిస్తారు. వీటిని పెద్దలకి ప్రసాదాలుగా పెట్టడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనేది చూస్తే.. ఆ రోజు ఎంతో శుభకార్యం. పెద్దలను తలచుకుని మనం కూడా కాస్త కృతజ్ఞతాపూర్వకంగా నడుచుకోవాలి. అలాంటివి అన్నీ మర్చిపోయి మనం ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. అందుకనే కనుము నాడు ప్రయాణం చెయ్యొద్దన్నారు. పితృదేవతలకి ఆరోజు ప్రసాదాలు పెట్టి మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేయడం మంచిది. అందుకని కనుమ నాడు ప్రయాణం చేయొద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు.
(The above story first appeared on LatestLY on Jan 16, 2022 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

