Heavy Rain Alert For Hyderabad: బంగాళాఖాతంలో వాయుగుండం, తీవ్ర తుఫానుగా మారనున్న ‘మహా’, హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన, తెంగాణాలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 4న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Hyderabad, November 3: అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 4న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్‌లో రానున్న 36 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే శనివారం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలుగా నమోదుకాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. గాలిలో తేమ 55 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Nov 03, 2019 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

