March 2022 Holidays: మార్చి నెలలో ఏకంగా 13 సెలవులు, బ్యాంక్ పనులు కోసం వెళ్లేవారు ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకోండి

ఒక్కొక్కసారి మనకు చాలా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటాయి. అయితే బ్యాంక్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యమధ్యలో సెలవు రోజులు (March 2022 Holidays) ఉంటాయి కాబట్టి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం ముఖ్యం.

March 2022 Holidays: మార్చి నెలలో ఏకంగా 13 సెలవులు, బ్యాంక్ పనులు కోసం వెళ్లేవారు ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకోండి
Representative Image (Photo Credits: Wiki Media Commons, Max Pixel)

ఒక్కొక్కసారి మనకు చాలా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటాయి. అయితే బ్యాంక్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యమధ్యలో సెలవు రోజులు (March 2022 Holidays) ఉంటాయి కాబట్టి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం ముఖ్యం. అదే విధంగా ముందుగానే ఏ రోజులు బ్యాంకులు సెలవు వచ్చాయనేది తెలుసుకుంటే బ్యాంక్ పనులుకి ఇబ్బంది లేకుండా ముందుగానే పూర్తి చేసుకోవడానికి వీలు అవుతుంది. అయితే ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 13 సెలవులు వచ్చాయి.

దేశ వ్యాప్తంగా చూస్తే బ్యాంకులకు మొత్తం 13 సెలవులు ఉన్నాయి. వేర్వేరు రీజియన్స్ లో వేరు వేరు రోజులు బ్యాంకులు కి సెలవులు ఉన్నాయి. కాబట్టి వీటిని గమనించడం మంచిది. అదే ఒక హైదరాబాదులో అయితే ఎనిమిది సెలవులు (March 2022 Holidays Calendar With Festivals & Events) వచ్చాయి. మార్చి 1 మహాశివరాత్రి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, హైదరాబాద్ లో సెలవులు) నాడు సెలవు ఇచ్చారు.

ఉక్రెయిన్ నుంచి పిల్లులను, కుక్కలను తమ వెంట తెచ్చుకున్న విద్యార్థులు, తాజాగా 628 మంది భారతీయులు స్వదేశానికి..

మిగతా సెలవులను ఓ సారి చూస్తే..

మార్చి 3 లోసర్ (గ్యాంగ్‌టాక్)

మార్చి 4 చప్చార్ కుట్ (ఐజ్వాల్)

మార్చి 6 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)

మార్చి 12 రెండో శనివారం (అన్ని చోట్ల సెలవులు)

మార్చి 13 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)

మార్చి 17 హోళికా దహన్ (డెహ్రడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ)

మార్చి 18 హోళీ (హైదరాబాద్‌, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రడూన్, గ్యాంగ్‌టక్, గువాహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, శషిమ్లా, శ్రీనగర్)

మార్చి 19 హోళీ మరుసటి రోజు సెలవు (భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నా)

మార్చి 20 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)

మార్చి 22 బీహార్ దివస్ (పాట్నా)

మార్చి 26 నాలుగో శనివారం (అన్ని చోట్ల సెలవులు)

మార్చి 27 ఆదివారం (అన్ని చోట్ల సెలవులు)

(The above story first appeared on LatestLY on Mar 03, 2022 04:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).