New Delhi, Mar 3: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను 'ఆపరేషన్ గంగ' (Operation Ganga)పేరుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను అక్కడ వదిలేశారు. కానీ పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకువచ్చేందుకు ఇటీవల కేంద్ర అనుమతించడం వల్ల ఇన్నాళ్లూ తమ వెంటే ఉంటున్న ఆ మూగజీవాల్ని (Indian Student Brings Friend’s Dog) స్వదేశానికి తీసుకువచ్చారు.
కేరళకు జహీద్ మరో విద్యార్థి తన స్నేహితుడు ఉక్రెయిన్‌లో వదిలేసిన పెంపుడు శునకాన్ని వెంట తెచ్చుకున్నాడు. నా పెంపుడు పిల్లి గత నాలుగు నెలలుగా నా వెంటే ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో నాతో పాటే బంకర్లలో తలదాచుకుని, పోలాండ్ సరిహద్దులు దాటి ఇప్పుడు భారత్ చేరుకుందని గౌతం అనే విద్యార్థి తెలిపాడు. వాయుసేన ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో పోలాండ్ నుంచి గురువారం పలువురు విద్యార్థులు భారత్ చేరుకున్నారు. వారితో పాటు పెంపుడు పిల్లులు, శునకాలు దర్శనమిచ్చాయి.
Here's ANI Updates
Hindan airbase | This cat has been with me for the past 4 months. It stayed with me in the bunker, and then we crossed into Poland together: Gautam, rescued from Kyiv, Ukraine has brought back his pet cat with him pic.twitter.com/B53TV1LE4M
— ANI (@ANI) March 3, 2022
Some of the evacuees brought their four legged best friends as well.
Good to have all of our #IndianStudents aboard on the @IAF_MCC C-17 Globemaster ready to return to the safety of our motherland.#OperationGanga #NoIndianLeftBehind@PMOIndia @narendramodi pic.twitter.com/XprDh0p57K
— General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 2, 2022
ఇన్నాళ్లు తమ వెంటే ఉన్న ఈ పెంపుడు జంతువులను అక్కడి ఉద్రిక్తత పరిస్థితుల్లో వదిలేయడం ఇష్టం లేక వాటిని కూడా భారత్కు తెచ్చామని తెలిపారు. వాయుసేన చేపడుతున్న విద్యార్థుల తరలింపు ప్రక్రియలో భాగంగా మరో 628 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. బుకెరాస్ట్ నుంచి వచ్చిన విమానంలో 200 మంది, బుడాపెస్ట్ నుంచి వచ్చిన దాంట్లో 220 మంది, రెజోవ్ నుంచి వచ్చిన విమానంలో 208 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.
తరలింపు ప్రక్రియపై పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్ ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగరీ, రోమేనియా, స్లోవేకియా, పోలాండ్ చేరుకున్నారు.