Aadhaar-Pan Linking: ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కు చివరి తేదీ ఇదే.. ఆ తర్వాత చేయాలంటే భారీ జరిమానా.. మరోసారి గడువు తేదీ పొడిగించేది లేదన్న ఆదాయపు పన్ను శాఖ.. తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సూచన

బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి.. రూ.50 వేలకు పైబడిన వ్యవహారాలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే! ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కాకుండా పోతే... ఆధార్ తో లింక్ చేయకుండా ఉంటే మీ పాన్ కార్డు రద్దయ్యే ముప్పు ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది.

Aadhaar-Pan Linking: ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కు చివరి తేదీ ఇదే.. ఆ తర్వాత చేయాలంటే భారీ జరిమానా.. మరోసారి గడువు తేదీ పొడిగించేది లేదన్న ఆదాయపు పన్ను శాఖ.. తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సూచన
Credits: Google

Hyderabad, Nov 20: బ్యాంకులో (Bank) ఖాతా (Account) తెరవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు (PAN Card) తప్పనిసరి.. రూ.50 వేలకు పైబడిన వ్యవహారాలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే! ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కాకుండా పోతే... ఆధార్ (Aadhaar) తో లింక్ చేయకుండా ఉంటే మీ పాన్ కార్డు రద్దయ్యే ముప్పు ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. పాన్ కార్డును, ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేసుకోవడానికి చివరి అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది.

ఇదేందయ్యా ఇది.. నేనెక్కడా చూడలే.. పోలీస్ స్టేషన్ నుంచే బైక్ కొట్టేశాడా? కేపీహెచ్ బీ ప్రాంతంలో బైక్ చోరీ.. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన దొంగ.. పోలీస్ స్టేషన్ లో ఉంచిన బైక్ ను మళ్లీ ఎత్తుకెళ్లిన దుండగుడు

ఈలోపు లింక్ చేసుకోవడం తప్పనిసరని, ఆ తర్వాత లింక్ చేయడం కుదరదని హెచ్చరిస్తోంది. గడువు తేదీని ఇప్పటికే పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. 31 మార్చి 2023 తర్వాత పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం సాధ్యం కాదని, పాన్ కార్డు రద్దయిపోతుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత ఈ లింక్ కోసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ రూ. వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోవచ్చని చెబుతోంది.

(The above story first appeared on LatestLY on Nov 20, 2022 11:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).