Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల
Parliament (photo-ANI)

Newdelhi, Jan 31: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget Session From Today) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉభయసభల్లో నేడు ఆర్థిక సర్వేను, శనివారం లోక్‌ సభలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. కాగా, జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి.

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ లో ఘటన

ఇవీ బిల్లులు..

ఈ బడ్జెట్ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వక్ఫ్‌(సవరణ) బిల్లు, బ్యాంకింగ్‌ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.

యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు 

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).