Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన.. 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్

తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్టు హెచ్చరించిన వాతావరణ కేంద్రం.. అటు ఏపీకి కూడా వర్షసూచన చేసింది. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన.. 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్
Rains (Credits: Pixabay)

Hyderabad, July 16: తెలంగాణలో (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) పడనున్నట్టు హెచ్చరించిన వాతావరణ కేంద్రం.. అటు ఏపీకి (AP) కూడా వర్షసూచన చేసింది. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, దీంతో బుధవారం కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జులై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది.

తొలి ఏకాదశి ఎప్పుడు..? ఉపవాసం, పూజ విధానం ఏమిటి...ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే..

ఈ జిల్లాల్లో వర్షాలు

ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, కోనసీమ, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వివరించింది.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో

(The above story first appeared on LatestLY on Jul 16, 2024 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).