TS TET Result 2023 Out: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేశారు.ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేశారు. ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కు 2.26 లక్షలు(84.12శాతం), పేపర్-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం) హాజరయ్యారు.
ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. దీని కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.
(The above story first appeared on LatestLY on Sep 27, 2023 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

