TTD SED Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఈ నెల 13న (సోమవారం) విడుదల చేయనుంది.

TTD SED Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..
Tirumala (File: Google)

Tirumala, Feb 11: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన (Special Entry Darshan) టికెట్లను (Tickets) టీటీడీ (TTD) ఈ నెల 13న (సోమవారం) విడుదల చేయనుంది. ఈ నెల 22 నుంచి 28 వరకు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఈ టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ఉంచుతామని పేర్కొంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలాలయం వాయిదా పడడంతో, ఆ మేరకు ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్టు వివరించింది.

ఎస్టీ జాబితాలోకి వాల్మీకి బోయలతో పాటు మరికొన్ని వర్గాల షెడ్యూల్డ్ తెగలు, కేంద్రానికి సిఫార్సు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం

ఇక, అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు వర్తించే ఈ అంగప్రదక్షిణం టికెట్లను ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో ఉంచనున్నారు.

అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తాం, పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని తెలిపిన సీఎం కేసీఆర్

(The above story first appeared on LatestLY on Feb 11, 2023 08:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).