MP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కారు చెట్టును ఢీకొట్టడంతో మంటలు, ఒకే కుటుంబంలో నలుగురు ఆ మంటల్లో సజీవదహనం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హర్దా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఓ చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో అందులో ప్రయాణించిన కొత్త దంపతులతో సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
Bhopal, may 31: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హర్దా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఓ చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో అందులో ప్రయాణించిన కొత్త దంపతులతో సహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. .ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పెళ్లికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు ఒక చెట్టును వేగంగా ఢీకొన్నది. దీంతో ఆ కారులో మంటలు చెలరేగాయి.
అందులో ఉన్న ఒక మహిళ, ముగ్గురు మగవారు మంటలంటుకున్న కారు నుంచి బయటకు రాలేకపోయారు. దీంతో వారు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శకటంతో సహా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒక మహిళతోసహా నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.పెళ్లైన కొత్త దంపతులు కూడా మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on May 31, 2023 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

