Surat, May 31: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో మే 18వ తేదీ జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్యలో జోక్యం చేసుకున్న కూతురిని ఓ తండ్రి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. . పారిపోతున్న కూతుర్ని వెంబడించి మరీ 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్ కడోదరాలోని సత్యనగర్ సొసైటీలోని అపార్ట్‌మెంట్‌లో భార్యాపిల్లలతో కలిసి రామానుజా సాహూ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు.
మే 18న రాత్రి 11:20 గంటల ప్రాంతంలో తన కూతురు టెర్రస్ మీద పడుకునే విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్న గొడవకే సాహూ ఆవేశంతో ఊగిపోయి ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి భార్యపై దాడికి దిగాడు. అది చూసిన పిల్లలు ఒక్కసారిగా భయపడిపోయారు. తల్లిని ఎలాగైనా రక్షించుకోవాలని తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పిల్లలు దగ్గరికి రావడంతో సాహూ వారిపై కూడా కత్తి విసిరాడు. వారిని వెంబడించి మరీ దాడికి దిగాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి పారిపోతున్న ఓ బాలిక అతనికి చిక్కింది. రూం దగ్గర కిందపడిపోయిన ఆ బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కన్నకూతురు కదా అని జాలి లేకుండా 25 సార్లు బాలికను కత్తితో పొడిచి చంపేశాడు.
అనంతరం తన నుంచి తప్పించుకుని పారిపోయిన భార్య రేఖ కోసం టెర్రస్‌పైకి వెళ్లాడు. అక్కడ ఆమెను కత్తితో పొడిచాడు. చేతివేళ్లను నరికేశాడు. కండ్ల ముందే కన్నతండ్రి చేస్తున్న మారణకాండను చూసి మిగిలిన పిల్లలు చలించిపోయారు. ఇప్పటికే తండ్రి చేతిలో సోదరిని కోల్పోయాం.. తల్లిని కూడా కోల్పోవద్దని తెగించారు. తండ్రి కత్తితో దాడి చేస్తున్నప్పటికీ ఎదురుతిరిగి అడ్డుకున్నారు.
షాకింగ్ వీడియో, బాలికను నడిరోడ్డు మీద కత్తితో పదే పదే పొడిచి చంపిన ప్రియుడు
దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సాహోను అదుపులోకి తీసుకున్నారు. భార్య రేఖ ఫిర్యాదు మేరకు సాహూపై మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్నారు.