‘Vettaiyan’ Trailer: త‌లైవా వెట్ట‌యాన్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది! సూప‌ర్ కాప్ గా క‌నిపించ‌బోతున్న ర‌జినీకాంత్..ట్రైల‌ర్ అద‌రగొట్టిందిగా

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్‌ (Vettaiyan). జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దుషారా విజయన్‌, రితికా సింగ్‌ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు

‘Vettaiyan’ Trailer: త‌లైవా వెట్ట‌యాన్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది! సూప‌ర్ కాప్ గా క‌నిపించ‌బోతున్న ర‌జినీకాంత్..ట్రైల‌ర్ అద‌రగొట్టిందిగా
Vettaiyan Trailer (Photo Credits: YouTube)

Chennai, OCT 02: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్‌ (Vettaiyan). జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దుషారా విజయన్‌, రితికా సింగ్‌ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 10న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్‌.

Here's the Trailer

ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు.. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉందంటూ బాధితురాలికి న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న సన్నివేశాలతో షురూ అయింది ట్రైలర్‌. వారం రోజుల్లో ఎన్‌కౌంటర్ జరిగిపోవాలి.. అంటే అక్కర్లేదు సార్ మూడే రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు వస్తుందంటున్నాడు తలైవా. అత్యాచార ఘటన నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.

Rajinikanth Hospitalised in Chennai: చెన్నైలోని దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నేడు గుండె సంబంధిత వైద్య ప‌రీక్ష‌లు 

మేకర్స్‌ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్‌ టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

(The above story first appeared on LatestLY on Oct 02, 2024 08:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).