UP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి, తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్‌రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
Mirzapur, Sep 4: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్‌రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాలీలో ఉన్న 10 మంది కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాద ధాటికి ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా పక్కనున్న కాలువలో ఎగిరిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. తీవ్రంగా గాయాలు.. నిజామాబాద్ లో ఘటన (వీడియో)
గాయపడిన వారిని వారణాసి ట్రామా సెంటర్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ట్రాక్టర్‌ను ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ అభినందన్ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 13 మంది కూలీలు ఉన్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 04, 2024 02:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

