Tamilnadu Shocker: బాయ్ ఫ్రెండ్ తో కలిసి కన్న తల్లిని చంపేసిన కూతురు, తమిళనాడులో దారుణం, పద్ధతి మార్చుకోమని మందలించినందుకు హత్య..

కూతురి ప్రవర్తనపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింద తల్లి. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. దీంతో తల్లిపై విపరీతమైన కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఓ బాయ్​ఫ్రెండ్​తో కలిసి సోమవారం తల్లిపై దాడి చేసింది. తల్లి నిద్రిస్తున్న సమయంలోనే దారుణంగా చంపేసింది.

Tamilnadu Shocker: బాయ్ ఫ్రెండ్ తో కలిసి కన్న తల్లిని చంపేసిన కూతురు, తమిళనాడులో దారుణం, పద్ధతి మార్చుకోమని మందలించినందుకు హత్య..
Representative Image

తూత్తుకుడి:  తమిళనాడు తూత్తుకుడి లో దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురే బాయ్​ఫ్రెండ్​తో కలిసి తల్లిని అంతమొందించింది. తల్లి నిద్రలో ఉండగా..దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళ్తే.. మునియలక్ష్మి అనే మహిళ.. మనస్పర్థల నేపథ్యంలో తన భర్తకు దూరంగా ఉంటోంది. నలుగురు పిల్లలతో కలిసి ట్యూటికోరన్​లో జీవనం సాగిస్తోంది. కుటుంబ పోషణ కోసం స్థానిక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తాత్కాలిక క్లీనర్​గా వర్క్ చేస్తుంది. కాగా మహిళ పెద్ద కూతురు(17) పాలిటెక్నిక్ మధ్యలోనే ఆపేసింది. స్థానికంగా చాలా మంది యువకులతో యువతి ఫ్రెండ్షిప్ చేసేది.

కూతురి ప్రవర్తనపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింద తల్లి. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. దీంతో తల్లిపై విపరీతమైన కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఓ బాయ్​ఫ్రెండ్​తో కలిసి సోమవారం తల్లిపై దాడి చేసింది. తల్లి నిద్రిస్తున్న సమయంలోనే దారుణంగా చంపేసింది.

సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో తల్లిని తానే హత్య చేసినట్లు యువతి ఒప్పుకుంది. అయితే, ఆ యువతి చెప్పిన మరో వెర్షన్ విని పోలీసులు కంగుతిన్నారు. వ్యభిచారం చేయాలని తనపై తల్లి ఒత్తిడి చేసిందని పోలీసులతో చెప్పింది యువతి. అందుకే మర్డర్ చేసినట్లు వెల్లడించింది తెలిపింది. దీంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Mar 29, 2022 03:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).