Agra Horror: వీడియో ఇదిగో.. సెల్ఫీ పేరుతో పసిపాపను యమునా నదిలోకి విసిరేసిన కసాయి తండ్రి.. భార్యను కూడా తోసి వేసేందుకు ప్రయత్నం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత క్రూరమైన సంఘటన వెలుగుచూసింది. కన్నతండ్రే రాక్షసుడిగా మారి.. ఏడాది వయసున్న కన్నకూతురిని యమునా నదిలోకి విసిరేసిన దారుణ ఉదంతం సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బరా యమునా వంతెన వద్ద జరిగింది.

Agra Horror: వీడియో ఇదిగో.. సెల్ఫీ పేరుతో పసిపాపను యమునా నదిలోకి విసిరేసిన కసాయి తండ్రి.. భార్యను కూడా తోసి వేసేందుకు ప్రయత్నం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు..
Man Accused of Throwing Infant Daughter Into Yamuna (Photo-Video Grab)

Agra Horror: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత క్రూరమైన సంఘటన వెలుగుచూసింది. కన్నతండ్రే రాక్షసుడిగా మారి.. ఏడాది వయసున్న కన్నకూతురిని యమునా నదిలోకి విసిరేసిన దారుణ ఉదంతం సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బరా యమునా వంతెన వద్ద జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రింకు, అతని భార్య లక్ష్మి తమ ఏడాది కుమార్తెతో కలిసి బైక్‌పై ఆగ్రా నగరాన్ని చూడటానికి బయలుదేరారు. మార్గమధ్యంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్బరా వంతెన వద్దకు రాగానే.. బిడ్డతో సెల్ఫీ దిగుతానని చెప్పి రింకు బైక్‌ను నిలిపివేశాడు. వంతెన రెయిలింగ్ వద్దకు వెళ్లి పాపతో ఫోటో దిగిన మరుక్షణం, ఆ పసికందును యమునా నదిలోకి విసిరేశాడు.

వీడియో ఇదిగో.. ఆలయ గర్భగుడిలో మైనర్ బాలికతో అసభ్యకరంగా పూజారి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు..

ఈ దారుణాన్ని చూసి భార్య లక్ష్మి అడ్డుకోవడానికి పరుగెత్తగా.. రింకు ఆమెను కూడా నదిలోకి తోసివేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె పెట్టిన కేకలు విని వెంటనే స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జరిగిన నిజాన్ని తెలుసుకుని నిందితుడు రింకును పట్టుకుని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Man Accused of Throwing Infant Daughter Into Yamuna

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యమునా నదిలోకి విసిరేసిన పసిపాప ఆచూకీ కోసం పీఏసీ (PAC) డైవర్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా ఆ చిన్నారి ఆచూకీ లభించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

(The above story first appeared on LatestLY on Aug 16, 2026 01:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).