Akshay Kumar Tested Covid Positive: బాలీవుడ్ స్టార్ హీరోకు క‌రోనా పాజిటివ్, అనంత్ అంబానీ పెళ్లి వేడుక‌ల స‌మ‌యంలో బాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం

ప్రస్తుతం ముంబై, బాలీవుడ్ స్టార్స్ అంతా అంబానీ (Ambani) ఇంట్లోనే ఉంది. అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ (Ananth Ambani Marriage) పెళ్లి వేడుకలు రెండు రోజుల నుంచి ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంతా ఈ పెళ్లిలోనే ఉన్నారు. అయితే బాలీవుడ్ అంతా సందడిగా ఉన్న సమయంలో ఓ హీరో షాక్ ఇచ్చాడు.

Akshay Kumar Tested Covid Positive: బాలీవుడ్  స్టార్ హీరోకు క‌రోనా పాజిటివ్, అనంత్ అంబానీ  పెళ్లి వేడుక‌ల స‌మ‌యంలో బాలీవుడ్ లో క‌రోనా క‌ల‌క‌లం
Akshay Kumar Tested Covid Positive

Mumbai, July 12: ప్రస్తుతం ముంబై, బాలీవుడ్ స్టార్స్ అంతా అంబానీ (Ambani) ఇంట్లోనే ఉంది. అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ (Ananth Ambani Marriage) పెళ్లి వేడుకలు రెండు రోజుల నుంచి ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంతా ఈ పెళ్లిలోనే ఉన్నారు. అయితే బాలీవుడ్ అంతా సందడిగా ఉన్న సమయంలో ఓ హీరో షాక్ ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కరోనా (Akshay Kumar Tested Covid Positive) వచ్చింది. అక్షయ్ కుమార్ నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా రీమేక్ సర్ఫిరా నేడు రిలీజ్ అయింది.

గత కొన్ని రోజులుగా అక్షయ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. అయితే రెండు రోజులుగా హెల్త్ బాగోకపోవడం, కరోనా లక్షణాలు కనపడటంతో ఇవాళ ఉదయం టెస్ట్ చేయించుకోగా అక్షయ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్షయ్ వెంటనే ఇంట్లోనే క్వారెంటైన్ అయి చికిత్స తీసుకుంటున్నాడు.

 

అక్షయ్ కి కరోనా రావడంతో అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు హాజరవ్వట్లేదు. అయితే గత కొన్ని రోజులుగా అక్షయ్ ని కలిసిన వారంతా ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారట. దీంతో ఈ స్టార్ హీరోకి కరోనా రావడంతో బాలీవుడ్ అంతా కంగారు పడుతుంది.

(The above story first appeared on LatestLY on Jul 12, 2024 10:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).