Puri Jagannath Temple Open: తెరుచుకున్న పూరి జగన్నాధుడి ద్వారాలు, ఆలయ పరిరక్షణ కోసం రూ.500 కోట్లు ఫండ్ విడుదల చేసిన కొత్త సీఎం

లయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రూ.500 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశామని, వచ్చే బడ్జెట్‌లో ఈ నిధులను విడుదల చేస్తామన్నారు. 12వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకు ఒక్క ద్వారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

Puri Jagannath Temple Open: తెరుచుకున్న పూరి జగన్నాధుడి ద్వారాలు, ఆలయ పరిరక్షణ కోసం రూ.500  కోట్లు ఫండ్ విడుదల చేసిన కొత్త సీఎం
Puri's Jagannath Temple (Credits: X)

Puri, June 14: ఒడిశాలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ ఆలయానికి (Puri Jagannath Temple) గల నాలుగు ద్వారాలు తెరచుకున్నాయి. గురువారం ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝితో (CM Mohan Charan Majhi) పాటు మంత్రులంతా పాల్గొన్నారు. ఇప్పటి నుంచి నాలుగు ద్వారాల గుండా భక్తులు పూరి జగన్నాథుడిని (Puri Jagannath) దర్శించుకోవచ్చని సీఎం తెలిపారు. క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు.

 

ఆలయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రూ.500 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశామని, వచ్చే బడ్జెట్‌లో ఈ నిధులను విడుదల చేస్తామన్నారు.

 

12వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకు ఒక్క ద్వారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభన ముందుకు వరకు ఆలయంలోని నాలుగు ద్వారా నుంచి భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. అయితే కొవిడ్‌ నేపథ్యంలో ఒక్క ద్వారా నుంచే భక్తులను అనుమతించారు. నాటినుంచి గత ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు. ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందుల దృష్ట్యా నూతనంగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం నేడు ఆలయ నాలుగు ద్వారాలను తెరిచింది.

(The above story first appeared on LatestLY on Jun 13, 2024 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).