Loot on Lockdown: లాక్‌డౌన్ సైడ్ ఎఫెక్ట్స్, విశాఖపట్నంలో మూసి ఉన్న వైన్స్ షాప్‌పై దోపిడి, 144 మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన తాగుబోతులు, కేసు నమోదు చేసిన పోలీసులు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ వాస్తవానికి గత ఆదివారం నుంచే కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ మద్యపానంపై నిషేధం విధించింది. ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటే ఇంటి టార్చర్, బయటకు వెళ్తే పోలీసుల టార్చర్. మరి ఇలాంటి కఠోరమైన పరీక్షలను ఎదుర్కొంటున్న మందుబాబులు....
Vishakhapatnam, March 26: ఊరంతా ఒక బాధ అయితే ఊర్లో ఉండే మందుబాబులది మరో బాధ అన్నట్లుంది ఈ వ్యవహారం. కరోనావైరస్ వ్యాప్తి (Coronvirus Outbreak) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ (Andhra Pradesh Lockdown) కట్టుదిట్టంగా కొనసాగుతుంది. ఎక్కడా కూడా అత్యవసర సేవలు మినహా ఇతర ఏ సేవలను గానీ ప్రభుత్వం అనుమతించడం లేదు. మెడికల్ షాపులు, నిత్యావసర దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయబడే ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయితే అందులో మందుబాబుల బాధ మాత్రం వర్ణనాతీతంగా ఉన్నట్లుంది. కొంతమంది తాగుబోతులు మూసిఉన్న మద్యంషాపు పడి మద్యం బాటిళ్లను (Liquor Bottles Robbery) ఎత్తుకెళ్లిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చి పూటుగా మద్యం తాగిఅదే ఇంట్లో పడుకున్న దొంగ, లేచి చూసేసరికి..
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ వాస్తవానికి గత ఆదివారం నుంచే కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ మద్యపానంపై నిషేధం విధించింది. ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటే ఇంటి టార్చర్, బయటకు వెళ్తే పోలీసుల టార్చర్. మరి ఇలాంటి కఠోరమైన పరీక్షలను ఎదుర్కొంటున్న మందుబాబులు అసహనంతో విసుగు చెంది విచక్షణ మరిచి వైన్స్ షాప్ పై పడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారిని రాష్ట్రంలోకి అనుమతించని ఏపీ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం నగరంలోని గాజువాక సెంటర్లో గల ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో నడిచే 3241 మద్యం దుకాణం షట్టర్లు కత్తిరించి వైన్స్ షాపులోంచి 12 కాటాన్ల మద్యాన్ని ఎత్తుకెళ్లారు. మొత్తం వివిధ రకాల 144 బాటిళ్ల మద్యం ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. వీటి విలువ రూ. సుమారు 1. 5 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Mar 26, 2020 06:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

