Chandrababu Slam Jagan: మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని వెల్లడి

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Chandrababu Slam Jagan: మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలి, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని వెల్లడి
Chandrababu Naidu Review (Photo/X/TDP)

Vjy, Oct 17: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆ పార్టీ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తనను జైల్లో పెడితే పవన్‌కల్యాణ్‌ వచ్చి పరామర్శించి.. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు.

మోదీ నుంచి అందరూ నేర్చుకోవాలని.. పట్టుదల, కృషి వల్లే ఆయన మూడోసారి ప్రధాని అయ్యారని కొనియాడారు. వైసీపీ చేయని తప్పులు లేవని.. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి 93 శాతం స్ట్రయిక్‌రేట్‌ ఇచ్చారన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు.

 5 నెలలు దాటినా సూపర్ సిక్స్ లేదు, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే చంద్రబాబు పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్

భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎన్నికల సీట్ల కేటాయింపులో టీడీపీకు అండగా ఉన్నవర్గాలకు ప్రాధాన్యం కల్పించాం. ఇంతవరకు ప్రాతినిధ్యం దక్కని వారికి అవకాశం కల్పించాం. ‘ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాం.

గెలిచాం మన పని అయిపోయిందని అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితుల వల్ల పార్టీని నమ్ముకున్న కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చాం. ప్రజలు మనల్ని విశ్వసించారు.. దాని ప్రకారం ముందుకెళ్లాలి. ఇప్పుడు అందరిపై బాధ్యత ఉంది. కొత్త ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దాదాపు 80 మంది వరకు కొత్తవారే. కుటుంబంలోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. ఫ్యామిలీని ఐక్యంగా ఉంచేందుకు ఇంటిపెద్ద ఆలోచిస్తుంటారు.

రాజకీయ పార్టీ కూడా అంతే. నాపై ఆ బాధ్యత ఉంది. . రాష్ట్రంలో ఏ అరాచకం చూసినా దాని వెనుక గంజాయి బ్యాచ్‌ ఉంటుంది. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వచ్చింది కనుక నిలదొక్కుకుంటున్నాం. 16,437 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చాం. వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం భూ ఆక్రమణలపైనే ఉన్నాయి. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు. ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యం. వరదలు వస్తే ఎలా పనిచేశామో చూశాం. యుద్ధప్రాతిపదికన పనులు చేశాం.. అందరినీ ఆదుకున్నాం.

చండీగఢ్‌లో హరియాణా సీఎం ప్రమాణస్వీకారం తర్వాత ఎన్డీయే సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ 5 గంటల పాటు అక్కడ కూర్చున్నారు. మోదీ అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మోదీ నుంచి నేర్చుకోవాలి. ఆయన పట్టుదల, కృషి వల్లే మూడోసారి ప్రధాని అయ్యారు. ఆరుసార్లు గుజరాత్‌లో బీజేపీ గెలిచింది.

మూడోసారి హరియాణాలో విజయం సాధించారు. సమష్టిగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందారు. ఏం చేసినా ప్రజలను దృష్టిలో ఉంచుకుని చేశారు. దేశంలో ఎవరికీ దక్కని విజయం మోదీకి దక్కిందంటే దాని వెనుక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయి. ఎక్కడా తప్పు చేయకుండా పార్టీని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు’’అని చంద్రబాబు కొనియాడారు.

(The above story first appeared on LatestLY on Oct 18, 2024 06:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).