AP Assembly Budget Session 2024: ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇవిగో, మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ (AP Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.
Vjy, Nov 11: ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ (AP Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.
రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని ఆయన తెలిపారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామని చెప్పారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని వివరించారు.
ముందుగా రైతులపై ప్రముఖ కవి గుర్రం జాషువా రాసిన..
‘‘వాని రెక్కల కష్టంబు లేని నాడు
సస్య రమ పండి పులకింప సంశయించు
వాడు చెమటోడ్చి ప్రపంచమునకు
భోజనము పెట్టువానికి భుక్తి లేదు..”
అన్న కవితను మంత్రి చదివి వినిపించారు.
రైతులకు ఈ పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని నిరంతరం ఆలోచించే, అందుకోసం నిరంతరం ప్రయత్నించే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అచ్చెన్నాయుడు చెప్పారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్ లో పకృతి వ్యవసాయానికి, సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగించి భూసార పరీక్షలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా రాయితీపై ఎరువుల పంపిణీ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.
కేటాయింపులు..
అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు
ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు
భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు
పంటల బీమా - రూ.1,023 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు
రాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లు
ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు
డిజిటల్ వ్యవసాయం - రూ.44.77 కోట్లు
వడ్డీ లేని రుణాలకు - రూ.628 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు - రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ - రూ.44.03 కోట్లు
(The above story first appeared on LatestLY on Nov 11, 2024 12:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

