Vjy, Nov 11: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఛాంబర్‌లో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత నిస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్‌ను రూపొందించింది.
రాష్ట్రంలోని వ్యవస్ధలను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన ద్రోహన్ని ఏడు స్వేత పత్రాల ద్వారా తెలియజేశామన్నారు. కేంద్ర పథకాల నిధులు మల్లింపు.. పిల్లల పౌష్టికాహరాన్ని అందించే పథకాల నిధులు కూడా మళ్ళింపు చేశారని, ఇంధన రంగ నిధులు మళ్ళింపు... ఇలాంటి పరిస్ధితుల వల్ల ఆర్ధిక గందరగోళ పరిస్ధితులు ఎదురయ్యాయని.. నేడు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ పతనం అంచున ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రాబాబు (CM Chandrababu) మాటలను మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. 57 శాతం ఓట్లతో 175 సీట్లకు గానూ 93 శాతం సీట్లు గెలిచామన్నారు. గత దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన విప్లవ సమాధానం ఈ ఫలితమని పయ్యవుల కేశవ్ వ్యాఖ్యానించారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇవీ..
పాఠశాల విద్య - రూ.29,909 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు - రూ.11,855 కోట్లు
ఎస్సీ సంక్షేమం - రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం - రూ.39,007కోట్లు
మైనార్టీల సంక్షేమం - రూ.4,376 కోట్లు
మహిళా శిశు సంక్షేమం - రూ.4,285 కోట్లు
మానవ వనరుల అభివృద్ధి - రూ.1,215 కోట్లు
ఉన్నత విద్య - రూ.2,326 కోట్లు
ఆరోగ్య రంగం - రూ.18,421 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి - రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి - రూ.11490 కోట్లు
గృహ నిర్మాణం - రూ.4,012 కోట్లు
జలవనరులు - రూ.16,705 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం - రూ.3,127 కోట్లు
ఇంధన రంగం - రూ.8,207 కోట్లు
రవాణా, రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతికం - రూ.322 కోట్లు
పోలీస్ శాఖ - రూ.8,495 కోట్లు
పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ - రూ.687 కోట్లు