Chandrababu in Assembly (photo-Video Grab)

Vijayawada, Nov 11: ఆంద్రప్రదేశ్ (Andhrapradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Sessions) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ. 2.90 లక్షల కోట్లతో 2024–25 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ -6 పథకాల అమలుకు వార్షిక బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభివృద్ధి – సంక్షేమం సమతూకంగా బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు.

ఏపీలో భారీ వర్షాలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు వానలే వానలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో దంచికొట్టనున్న వర్షాలు

మంత్రివర్గం ఆమోదం తర్వాత

ఉదయం 9.20 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అనంతరం బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

రష్యా రాజధానిపై 34 డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్, ఆ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించిన రష్యా సైన్యం