Assams Lady Singham: కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన మహిళా పోలీస్, ఆ పనిచేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళా సింగమ్, పట్టించిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పిన లేడీ కాప్

గత అక్టోబర్ లో రాణా పొగాగ్ (Rana Pogag) తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉంది. రాణా పొగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మహిళా ఎస్ఐకి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతడు ఓ ఘరానా మోసగాడని తర్వాత తేలింది.

Assams Lady Singham: కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన మహిళా పోలీస్, ఆ పనిచేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళా సింగమ్, పట్టించిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పిన లేడీ కాప్

Assam, May 06: ఆమె ఓ పోలీస్ ఆఫీసర్(Women Police). డ్యూటీ మైండెండ్. నిజాయితీకి నిలువెత్తు రూపం. తమ, పర అనే భేదం లేదు. అయిన వాళ్లైనా, కాని వాళ్లైనా అందరూ సమానమే. వ్యక్తిగత అనుబంధాల కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యమిస్తుంది. ఆ పోలీసు అధికారిణి ఇప్పుడు అందరితో శభాష్ అనిపించుకుంది. సూపర్ కాప్ అని పొగడ్తల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందో తెలుసా? ఏకంగా తనకు కాబోయే భర్తనే అరెస్ట్ చేసి జైల్లో వేసింది. ఏంటి? కంగుతిన్నారా? కాబోయే భర్తను అరెస్ట్ చేయడం ఏంటనే డౌట్ వచ్చిందా? ఎందుకంటే, అతడు మోసగాడని తెలియడంతో ఏమాత్రం ఆలోచన చేయకుండా అతడిని అరెస్ట్ చేసింది.ఆ మహిళా పోలీస్ పేరు జున్మోని రభా(Junmoni Rabha). అసోంలోని నాగావ్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తోంది. గత అక్టోబర్ లో రాణా పొగాగ్ (Rana Pogag) తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉంది. రాణా పొగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మహిళా ఎస్ఐకి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతడు ఓ ఘరానా మోసగాడని తర్వాత తేలింది.

Bihar Shocker: తోటి విద్యార్థులే కామాంధులయ్యారు, కోచింగ్ సెంటర్‌లో మైనర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 5 మంది విద్యార్థులు 

తాను ఓఎన్జీసీలో (ONGC) పని చేస్తున్నానని, తనకు డబ్బులు ఇస్తే ఓఎన్జీసీలో (ONGC)ఉద్యోగాలు కల్పిస్తానని పలువురి నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశాడు రాణా పొగాగ్. ఈ విధంగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయం వెల్లడైంది. చివరికి అతడి పాపం పండింది. బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ జున్మోని రభా(Junmoni Rabha)… కాబోయే భర్త రాణా పొగాగ్ ను అరెస్ట్ చేసింది.

Delhi Shocker: ఢిల్లీలో దారుణం, తరగతి గదిలో విద్యార్థినులపై లైంగికదాడి చేసిన కామాంధుడు, బాలికల బట్టలు విప్పి వారి ముందేతన బట్టలు విప్పి మూత్రం పోసిన దుండగుడు 

కాబోయే భర్తను అరెస్ట్ చేసిన ఎస్ఐ.. హ్యాపీగా ఫీల్ అయ్యింది.పెద్ద మోసగాడి బారినుంచి తన జీవితం బయటపడినందుకు సంతోషంగా ఉందన్నారు. అతడి నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడారని కొనియాడారు. రాణా పోగాగ్ ఎంత మోసగాడో అర్థమైందని వెల్లడించారు. కాబోయే భర్త అని కూడా చూడకుండా మోసగాడని తెలిసిన వెంటనే అరెస్ట్ చేసిన లేడీ పోలీస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమెను లేడీ సింగంగా, లేడీ దబాంగ్ గా అభివర్ణిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on May 06, 2022 12:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).